ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో మరో మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా అనౌన్స్మెంట్ వీడియోను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ మూవీ షూటింగ్‌ను మొదలుపెట్టే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. ఇక హారిక & హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. తమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించనున్నారట.