మంచు విష్ణు దుబాయ్ నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఫ్యామిలీ వివాదాన్ని పెద్దగా చిత్రీకరించటం తగదని అన్నారు. కుటుంబంలో చిన్నపాటి వివాదాలు తలెత్తాయని పేర్కొన్నారు. త్వరలో అవన్నీ పరిష్కారమవుతాయని చెప్పారు. అయితే మంచు కుటుంబంలో విబేధాల నేపథ్యంలో మోహన్ బాబు, మనోజ్ పరస్పరం ఫిర్యాదు చేసుకున్న విషయం తెలిసిందే.