మంచు ఫ్యామిలీలో విబేధాల నేపథ్యంలో రెండు కేసులు నమోదయ్యాయి. మంచు మోహన్ బాబు, మనోజ్ పరస్పరం ఫిర్యాదులు చేసుకోవటంతో చర్యలు తీసుకున్నట్లు పహాడీషరీఫ్ పోలీసులు తెలిపారు. మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుపై మనోజ్‌తో పాటు భార్య భూమా మౌనికపై కేసు పెట్టారు. మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుపై మోహన్ బాబుకు చెందిన 10 మంది అనుచరులపై కేసు నమోదైంది.