బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్ ప్రధాన పాత్రలో సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాపై రణ్బీర్ అప్డేట్ ఇచ్చారు. దీని షూటింగ్ 2027 స్టార్ట్ కానున్నట్లు, ఇందులో హీరో విలన్ మధ్య ఆసక్తికర పోరు ఉంటుందని పేర్కొన్నారు. అలాగే యానిమల్ పార్ట్ 3 కూడా ఉంటుందని చెప్పారు.