తాను అధ్యక్ష పదవి చేపట్టగానే అక్రమ వలసదారులందరినీ అమెరికా నుంచి వెళ్లగొడతానని డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అయితే చట్టబద్ధంగా వలస వచ్చేవారికి మాత్రం మార్గం మరింత సులువు చేస్తానని చెప్పారు. ఇది భారతీయులకు శుభవార్త కావచ్చు. అమెరికాలో సాధికారికంగా ప్రవేశం పొందాలనుకునేవారు ఈ దేశాన్ని ప్రేమించాలి. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అంటే ఏమిటో చెప్పగలగాలన్నారు.