నటుడు జోజూ జార్జ్, అభినయ ప్రధాన పాత్రల్లో ‘పని’ మూవీ తెరకెక్కింది. ఈ మూవీకి జోజూ జార్జ్నే దర్శకత్వం వహించారు. తాజాగా ఈనెల 13న థియేటర్లలో తెలుగు వర్షన్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. జోజూ జార్జ్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మలయాళంతో పాటు తమిళం, తెలుగు భాషల్లో పలు సినిమాలు చేశాడు. గతంలో తెలుగులో ‘ఆదికేశవ’ మూవీలో విలన్‌గా నటించాడు.