గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ మూవీ నుంచి మెగా అప్‌డేట్ రాబోతోంది. చరణ్ బర్త్ డే సందర్భంగా రేపు ఉదయం 9:45 గంటలకు బిగ్ అనౌన్స్‌మెంట్ ఇవ్వనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘బ్యాట్ పట్టుకోవడం చూశారు.. ఇప్పుడు గద పట్టుకోవడం చూస్తారు’ అంటూ విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
విక్రాంత్ మాస్సే, రాశి ఖన్నా జంటగా నటించిన ‘ది సబర్మతి రిపోర్ట్’ చిత్రం 2024లో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అయినప్పటికీ, మేకర్స్ ఈ చిత్రానికి సీక్వెల్‌ను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ‘ది టెర్రర్ రిపోర్ట్’ పేరుతో ఈ సీక్వెల్‌ను రూపొందించబోతున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ సీక్వెల్‌కు విష్ణువర్ధన్ దర్శకత్వం వహించనున్నాడు.
మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇరుముడి’. శ్రీరామనవమి కానుకగా తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా, సాయి కుమార్, అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
యంగ్ హీరో రామ్ పోతినేని తన తర్వాతి చిత్రాన్ని తమిళ దర్శకుడు విఘ్నేష్ దర్శకత్వంలో చేయబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని హర్రర్ థ్రిల్లర్ జోనర్‌లో భారీ స్థాయిలో తెరకెక్కించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో ప్రతినాయకుడిగా మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్, అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందించే అవకాశం ఉందని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్, సాయి దుర్గా తేజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘బ్రో’ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్ర సీక్వెల్‌పై దర్శకుడు సముద్రఖని స్పందించాడు. ‘బ్రో-2’ చేయాలని తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపాడు. పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే వెంటనే సినిమా పనులు ప్రారంభిస్తానని పేర్కొన్నాడు. దీంతో ఈ చిత్రం త్వరలోనే పట్టాలెక్కే అవకాశం ఉంది.
శర్వానంద్ ‘బైకర్’ చిత్రం ఏప్రిల్ 3న విడుదల కానుంది. ఈ సినిమాలో సీనియర్ నటుడు రాజశేఖర్ ఒక కీలక పాత్రలో నటించాడు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘జెంటిల్‌మేన్’ సినిమాలో తాను హీరోగా నటించాల్సి ఉందని వెల్లడించాడు. అయితే, అప్పట్లో కాల్‌షీట్లు సర్దుబాటు కాకపోవడంతో ఆ చిత్రాన్ని వదులుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నాడు.
‘లిటిల్ హార్ట్స్’ మూవీతో దర్శకుడిగా పరిచమైన సాయి మార్తాండ్ తొలి ప్రాజెక్టుతో భారీ విజయం అందుకున్నాడు. తాజాగా ఆయన.. హీరో అడివి శేష్‌తో సినిమా చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇటీవల అడివి శేష్‌కి సాయి మార్తాండ్ కథను వినిపించగా.. అతను ఓకే చెప్పాడట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం.
రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ‘ధురంధర్ 2’ చిత్రం కేవలం 7 రోజుల్లోనే రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరి సంచలనం సృష్టించింది. ఈ అద్భుత విజయంపై చిత్ర బృందానికి స్టార్ హీరో ఆమిర్ ఖాన్ శుభాకాంక్షలు తెలిపాడు. అయితే, తాను ఇప్పటివరకు ఈ సినిమాను చూడలేదని, కానీ మూవీ చాలా బాగుందని అందరూ చెబుతున్నారని పేర్కొన్నాడు. త్వరలోనే ఈ చిత్రాన్ని వీక్షిస్తానని వెల్లడించాడు.
రవితేజ, దర్శకుడు శ్రీనువైట్ల కాంబోలో వచ్చిన ‘వెంకీ’ మూవీ విడుదలై నేటితో 22ఏళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా శ్రీనువైట్ల ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఇది కేవలం సినిమా కాదు, ఒక మధుర ప్రయాణమని పేర్కొన్నాడు. సహజమైన నైట్ ఎఫెక్ట్ కోసం 70 రోజుల షూటింగ్‌లో, వరుసగా 40 రాత్రులు కష్టపడ్డామని వెల్లడించాడు. రవితేజ అందించిన తిరుగులేని సహకారం వల్లే ఈ అద్భుతం సాధ్యమైందని అన్నాడు.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రిషబ్ శెట్టి నటించనున్న సినిమా ‘జై హనుమాన్’. ఈ మూవీ కోసం రిషబ్ రూ.20 కోట్ల రెమ్యూనరేషన్ + లాభాల్లో వాటాను తీసుకోనున్నట్లు టాక్. దీనివల్ల నిర్మాతలపై భారం తగ్గడమే కాకుండా, సినిమా బ్లాక్ బస్టర్ అయితే రిషబ్‌కు భారీ లాభం చేకూరుతుంది. ఒకవేళ ఈ చిత్రం రూ.600 కోట్లు వసూలు చేస్తే, వాటాల రూపంలో ఆయనకు ఏకంగా రూ.150 కోట్లకుపైగా వచ్చే అవకాశం ఉందట.
బావమరదళ్ల ప్రేమకథతో వచ్చిన సినిమా ‘బ్యాండ్ మేళం’. మ్యూజిక్ ఇండస్ట్రీలో రాణించాలనుకునే యాదగిరి(రోషన్).. తన మరదలు రాజి(శ్రీదేవి) ప్రేమని ఎలా గెలుచుకున్నాడనేది ఈ మూవీ కథ. నటీనటుల ప్రతిభ, అక్కడక్కడా పండిన కామెడీ, సంగీతం సినిమాకు బలాన్నిచ్చాయి. అయితే.. రొటీన్ కథ, భావోద్వేగాలు పండకపోవడం, సాగదీత సీన్లు బోర్ కొట్టిస్తాయి. రేటింగ్: 2.25/5.
‘ఉస్తాద్ భగత్ సింగ్’లో పవన్ కళ్యాణ్ డబుల్ ఎంట్రీ సీన్‌పై వచ్చిన ట్రోల్స్‌కు దర్శకుడు హరీష్ శంకర్ గట్టిగా సమాధానమిచ్చాడు. ఒకే సీన్‌లో పవన్ రెండుసార్లు జీపు దిగడంపై స్పందిస్తూ.. ‘నాకు ఆ రెండు షాట్స్ నచ్చాయి. అందుకే పెట్టా. కొన్నిసార్లు లాజిక్ కంటే నాకు నచ్చిన మేకింగ్ స్వేచ్ఛకే ప్రాధాన్యత ఇస్తా. ఇలాంటి చిన్న చిన్న విమర్శలను నేను అస్సలు పట్టించుకోను’ అని అన్నాడు.
మలయాళ హీరో జయసూర్య, అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ ‘కథనార్’. అనుష్క ఈ సినిమాతో మలయాళంలోకి ఎంట్రీ ఇస్తోంది. 2026, మార్చి 31న మధ్యాహ్నం 1:31 గంటలకు ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కానుంది. తాజాగా ట్రైలర్‌కు ఇంకా 5 రోజులు మాత్రమే ఉందని మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఇక కేరళలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రాబోతున్న ఈ చిత్రాన్ని రోజిన్ థామస్ తెరకెక్కిస్తున్నాడు.
శ్రీవిష్ణు హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘మృత్యుంజయ్’ మార్చి 6న రిలీజై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా OTT రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. దీని డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. ఏప్రిల్ 3, 2026 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కించిన ఈ మూవీలో రెబా మోనికా జాన్ నటించగా, కాల భైరవ సంగీతం అందించాడు.
ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల వేళ ఐకమత్యంగా ఉండాలన్న ప్రధాని మోదీ పిలుపుపై ‘కాంతార’ నటుడు కిషోర్ మండిపడ్డారు. దేశాన్ని కులమతాల వారీగా విభజించి, ప్రజల మధ్య ద్వేషాన్ని నింపిన తర్వాత మళ్లీ ‘అందరం ఒకటి’ అనడంపై ఆయన సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. ప్రధాని అనాలోచిత నిర్ణయాల వల్ల దేశం ఇప్పటికే ఎన్నో సవాళ్లు ఎదుర్కొందని, ఇకనైనా విద్వేష రాజకీయాలు ఆపాలని అన్నారు.