‘స్టార్’ సినిమా హీరో కవిన్ ‘మాస్క్’ మ్యాన్‌గా ప్రేక్షకులను అలరించనున్నాడు. ఈ సినిమాలో ఆండ్రియా, రుహానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వికర్ణన్ అశోక్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా ఈనెల 21న విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. చెన్నై నేపథ్యంలో డార్క్ కామెడీ థ్రిల్లర్‌గా మూవీ తెరకెక్కించారు.
బిగ్‌బాస్ నుంచి రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అలాగే, ఈ వారం ఓటింగ్‌లో తక్కువ ఓట్లు వచ్చిన సాయి శ్రీనివాస్ కూడా ఎలిమినేట్ అయ్యాడు. నామినేషన్స్‌లో అతడితో పాటు సంజన, సుమన్ శెట్టి, రాము, కళ్యాణ్, భరణి, తనూజ ఉన్నారు. వారిలో సాయి ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. దీంతో హౌస్‌లో ఇంకా 10 మంది కంటెస్టెంట్లు కొనసాగుతున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ భోజన ప్రియుడు అన్న విషయం తెలిసిందే. సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు తనతో పాటు పనిచేసే నటీనటులకు కూడా తన ఇంట్లో వండిన భోజనం పంపించాడు. తాజాగా ‘ఫౌజీ’ హీరోయిన్ ఇమాన్వీకి డార్లింగ్ ప్రత్యేక విందు పంపించాడు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ‘మనసు, కడుపు నిండిపోయింది. మీ ప్రేమకు థాంక్యూ ప్రభాస్ గారు’ అంటూ వీడియో పోస్ట్ చేసింది.
‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’తో హిట్ అందుకున్న హీరో తిరువీర్ తన తదుపరి సినిమాను లైన్లో పెట్టేశాడు. గంగ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్ర ప్రారంభోత్సవాన్ని ఆదివారం పూజా కార్యక్రమాలతో నిర్వహించారు. ఈ మూవీతో భరత్ దర్శన్ దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయం కానుండగా.. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా నటిస్తోంది.
మాస్ మహారాజా రవితేజతో దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్న చిత్రం ‘RT76’. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను రేపు మధ్యాహ్నం 3:33 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ఓ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే, ఈ చిత్రానికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం సాగుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమాలోని ‘చికిరి’ పాట రికార్డులను సృష్టిస్తోంది. ఈ పాట విడుదలైన 35 గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి దాదాపు 53 మిలియన్ల(5.3 కోట్లు) వ్యూస్ సాధించింది. తెలుగులో 35M, హిందీలో 12M, తమిళంలో 2.8M, కన్నడలో 1.6M వ్యూస్‌తో ఈ పాట దూసుకుపోతోంది. జానీ మాస్టర్‌ను కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో రామ్ చరణ్ చేసిన డ్యాన్స్ స్టెప్స్ అభిమానులను విశేషంగా ఆకట్టు...
హీరో రామ్ పోతినేని, దర్శకుడు P.మహేష్ బాబు కాంబోలో ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ మూవీలోని మరో పాటపై అప్డేట్ వచ్చింది. ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సాంగ్‌ను రేపు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇక భాగ్యశ్రీ బార్సే కథానాయికగా నటిస్తోన్న ఈ మూవీ NOV 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
టాలీవుడ్ హీరో ప్రియదర్శి నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘మిత్రమండలి’ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే థియేటర్లలో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా OTTలో సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకుంటోంది. సదరు OTTలో టాప్ 2లో ట్రెండ్ అవుతోంది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు విజయేందర్ S తెరకెక్కించాడు.
సూపర్ సార్ మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబోలో ‘SSMB 29’ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్, ఆయన పాత్ర రివీల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్‌పై నయా అప్డేట్ వచ్చింది. ఈ నెల 11న ఆమె ఫస్ట్ లుక్‌తో పాటు పాత్రను రివీల్ చేయనున్నారట. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘ది గర్ల్‌ఫ్రెండ్’. ప్రస్తుతం ఇది ప్రేక్షకులను అలరిస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫస్ట్ డే తెలుగు, హిందీలో రూ.1.30కోట్లు, రెండో రోజు రూ.2.50కోట్లు నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించాడు.
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటించిన ‘జటాధర’ మూవీ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సినిమా రెండు రోజుల్లో రూ.2.91 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఈ మేరకు ఇందుకు సంబంధించిన పోస్టర్ వెలువడింది. ఇక ఈ చిత్రాన్ని దర్శకులు వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైశ్వాల్ తెరకెక్కించారు.
తన మార్ఫింగ్ ఫొటోలు SMలో వైరల్ అవ్వడంపై నటి అనుపమ పరమేశ్వరన్ స్పందించింది. ‘దీనిపై పోలీసులను ఆశ్రయించగా.. విచారణలో తమిళనాడుకు చెందిన 21ఏళ్ల అమ్మాయి నా ఫొటోలను మార్ఫింగ్ చేసినట్లు తేలింది. ఇన్‌స్టాలో ఫేక్ అకౌంట్ సృష్టించి మార్ఫింగ్ ఫొటోలతో పాటు అసభ్యకర కంటెంట్‌తో నా ఇమేజ్ను డ్యామేజ్ చేసింది. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను’ అని పోస్ట్ పెట్టింది.
రెబల్ స్టార్ ప్రభాస్‌తో దర్శకుడు మారుతి తెరకెక్కిస్తోన్న మూవీ ‘రాజాసాబ్’. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్‌పై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అప్డేట్ ఇచ్చాడు. దీనిపై ఒక వారంలో ప్రకటన వస్తుందని అన్నాడు. ఈ సినిమాలోని మూడు పాటలను వరుసగా రిలీజ్ చేస్తామని చెప్పాడు. ఈ సినిమా కచ్చితంగా అందరినీ అలరిస్తుందన్నాడు. ఇక ఈ చిత్రం 2026 జనవరి 9న విడుదలవుతుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరుడు, నటుడు దివంగత రమేష్ బాబు తనయుడు జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అజయ్ భూపతి దర్శకత్వంలో అతను సినిమా చేయనున్నాడు. ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చింది. త్వరలోనే టైటిల్‌ను వెల్లడిస్తామని అజయ్ భూపతి చెప్పాడు. నిర్మాత అశ్వనీదత్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాడు. ఇక ఈ చిత్రం తిరుమల బ్యాక్‌డ్రాప్‌లో రాబోతుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబోలో మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా మృణాల్‌పై కీలక సన్నివేశాన్ని తెరకెక్కించారట. తదుపరి షెడ్యూల్లో బన్నీ, జాన్వీలపై ఓ లవ్ సీక్వెన్స్‌ను షూట్ చేయనున్నట్లు సమాచారం.