• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

ప్రియదర్శి ‘సుయోధన’ మూవీ రివ్యూ

ఫోలే ఆర్టిస్ట్ (సౌండ్ డిజైనర్) అయిన హీరోకి ప్రమాదం వచ్చినప్పుడు ఒక సౌండ్ వినిపిస్తుంది. ఎవరి నుంచి ఆపద ఉందో వాళ్లు దుర్యోధనుడిగా కనిపిస్తారు. ఇంతకీ హీరోకి ఉన్న ప్రమాదం ఏంటన్నదే ‘సుయోధన’ మూవీ స్టోరీ. దర్శకుడు వైఎస్ మాధవ్‌కి తొలి సినిమా అయినా తడబడకుండా తెరకెక్కించాడు. ప్రియదర్శి, సాయికుమార్, ప్రేమ నటన బాగుంది. థ్రిల్లింగ్ మూమెంట్స్ అలరిస్తాయి. రేటింగ్: 3/5.

March 27, 2026 / 12:01 PM IST

ఎన్టీఆర్ ‘డ్రాగన్’ షూటింగ్ UPDATE

జూ.ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న ‘డ్రాగన్’ మూవీ షూటింగ్ అప్‌డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీ చిత్రీకరణ ఇప్పటివరకు కేవలం 40% మాత్రమే పూర్తయినట్లు సమాచారం. నీల్ మార్క్ భారీ యాక్షన్ సీన్లు, విజువల్ గ్రాండియర్ కోసం తీసుకుంటున్న జాగ్రత్తల వల్లే ఆలస్యమవుతోందట. దీంతో NTR ఫ్యాన్స్ ఈ సినిమా విడుదల కోసం మరికొంత కాలం వేచి చూడక తప్పదని సినీ వర్గాలు పేర్కొన్నాయి.

March 27, 2026 / 11:46 AM IST

అడగ్గానే చరణ్‌ రూ.40లక్షలు ఇచ్చారు: జానీ మాస్టర్‌

రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చరణ్ ఒక గొప్ప మనసున్న వ్యక్తి అని, డ్యాన్సర్ల కష్టాలు తెలిసిన ఆయన వారి కోసం రూ.40 లక్షలతో సుమారు 2000 మందికి ఇన్సూరెన్స్ చేయించారని కొనియాడాడు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారని, డ్యాన్సర్స్ యూనియన్ మొత్తం చరణ్‌కు రుణపడి ఉంటుందని భావోద్వేగానికి లోనయ్యాడు.

March 27, 2026 / 11:31 AM IST

‘రామాయణ’ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా నితేష్ తివారీ తెరకెక్కిస్తోన్న మూవీ ‘రామాయణ’. శ్రీరామనవమి సందర్భంగా మేకర్స్ ఈ మూవీ గ్లింప్స్ ‘రామ’పై అప్‌డేట్ ఇచ్చారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 2న ఈ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల సమక్షంలో ఒక భారీ ఈవెంట్‌తో ఈ మూవీ ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేయనున్నట్లు చెప్పారు.

March 27, 2026 / 11:14 AM IST

రెండు వారాల్లోనే OTTలోకి క్రైమ్ థ్రిల్లర్..!

చైతన్య రావు, హెబ్బా పటేల్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘రేపు ఉదయం 10 గంటలకు’ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. చందు ముద్దు దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 14, 2026న థియేటర్లలో విడుదలైంది. అభినవ్ గోమఠం, కిరీటి కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం అందుకోలేదు. దీంతో కేవలం రెండు వారాల్లోనే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.

March 27, 2026 / 11:00 AM IST

జీవితంలో ఈ ముగ్గురిని మర్చిపోకండి: శర్వా

జీవితంలో ముగ్గురిని ఎప్పటికీ మర్చిపోకూడదని శర్వానంద్ అన్నాడు. ‘బైకర్’ ప్రమోషన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘కష్టాల్లో తోడున్నవారిని, కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేసిన వారిని, మనల్ని కష్టాల్లోకి నెట్టిన వారిని ఎన్నటికీ మర్చిపోవద్దు. ఎవరైనా నిరుత్సాహపరిచినా పట్టించుకోకండి. మీ విజయమే అవమానించిన వారికి అసలైన సమాధానం కావాలి. మనసు పెడితే ఏదైనా సాధించగలం’ అని చెప్పాడు.

March 27, 2026 / 10:46 AM IST

ఆ సంస్థ చేతికి ‘చెన్నై లవ్ స్టోరీ’ ఆడియో హక్కులు

కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా రవి నంబూరి దర్శకత్వంలో ‘చెన్నై లవ్ స్టోరీ’ తెరకెక్కుతోంది. ఎస్.కె.ఎన్, సాయి రాజేష్ నిర్మిస్తున్న ఈ చిత్ర ఆడియో హక్కులను ప్రముఖ సంస్థ టీ-సిరీస్ సొంతం చేసుకుంది. యువతను ఆకట్టుకునే అంశాలతో రూపొందుతున్న ఈ మూవీ మ్యూజిక్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.

March 27, 2026 / 10:24 AM IST

నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది: చరణ్‌కు చిరు విషెస్

మెగాస్టార్ చిరంజీవి తన కుమారుడు రామ్ చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేశారు. ‘చిన్నప్పుడు నా చేయి పట్టుకోవడం నుంచి నేడు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలవడం వరకు.. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది చరణ్. నీ క్రమశిక్షణ, కుటుంబంపై బాధ్యత, దైవచింతన నీపై నా ప్రేమను మరింత పెంచుతున్నాయి. దేవుడి దీవెనలతో నువ్వు మరిన్ని శిఖరాలు అధిరోహించాలి’ అని పేర్కొన్నారు.

March 27, 2026 / 09:45 AM IST

శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు: బాలకృష్ణ

తెలుగు వారందరికీ సినీ నటుడు, ఏపీలోని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అధర్మాన్ని నశింపజేసి.. ధర్మాన్ని ప్రతిష్టింపజేయడానికే శ్రీరామ అవతారం అని గుర్తుచేశారు. కష్టాలొచ్చినా ధర్మానికే నిలబడిన శ్రీరాముడు మనందరికీ ఆదర్శనీయుడని పేర్కొన్నారు. శ్రీరాముడి ఆశీస్సులతో సర్వశుభాలు, సంతోషాలు కలగాలని కోరుకున్నారు.

March 27, 2026 / 09:45 AM IST

విజయ్‌పై వ్యాఖ్యలు.. స్పందించిన సముద్రఖని

నటుడు, టీవీకే అధినేత విజయ్‌పై తాను చేసిన వ్యాఖ్యలపై సముద్రఖని స్పందించాడు. ‘కార్మేని సెల్వం’ ప్రమోషన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘విజయ్‌కు మొదట మద్దతు ఇచ్చింది నేనే, అందుకే ఆయన నిర్ణయంపై నా బాధను వెలిబుచ్చాను. నా మాటలను ఎవరో మధ్యలో రికార్డ్ చేసి తప్పుగా చూపారు. రికార్డ్ చేస్తున్నారని తెలిసి కూడా నా మనసులోని మాటను దాచుకోకుండా చెప్పాను’ అని క్లారిటీ ఇచ్చాడు.

March 27, 2026 / 09:30 AM IST

భారీ హంగులతో సల్మాన్‌ కొత్త చిత్రం?

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజుల క్రేజీ కాంబోలో సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ ఏప్రిల్‌లో ప్రారంభం కానుందట. దీని కోసం ముంబైలోని SRPF గ్రౌండ్‌లో ఒక భారీ సెట్‌ను (మినీ సిటీలా) నిర్మిస్తున్నారట. భారీ యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం చిత్రబృందం ప్రత్యేక కసరత్తులు చేస్తున్నట్లు టాక్.

March 27, 2026 / 09:06 AM IST

హ్యాపీ బర్త్ డే రామ్ చరణ్

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు. టాలీవుడ్‌లో ‘చిరుత’గా అడుగుపెట్టి.. ‘మగధీర’తో రికార్డులు సృష్టించి, ‘RRR’తో గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు. నటనలో వైవిధ్యం, అద్భుతమైన డ్యాన్సింగ్‌తో అభిమానుల మనసు గెలుచుకున్నాడు. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ సత్తా చాటుతున్న చరణ్‌కు మరిన్ని విజయాలు అందుకోవాలని ...

March 27, 2026 / 07:29 AM IST

మార్చి 27: టీవీలలో సినిమాలు

స్టార్ మా: ఆదిపురుష్(9AM), కె-ర్యాంప్(3.30PM); జీతెలుగు: చిరుత(9AM); జెమిని: నాయక్(9AM), ఔనన్నా కాదన్న(3:30PM); స్టార్‌మా మూవీస్: బద్రీనాథ్(7AM), మగధీర(9AM), వినయ విధేయ రామ(12PM), రంగస్థలం(3.30PM), RRR(6PM), బ్రహ్మాస్త్రం(10PM); జీ సినిమాలు:  రైటర్ పద్మనాభం(7AM), శ్రీరామరాజ్యం(9AM), గేమ్ ఛేంజర్(12PM), మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం(3PM).

March 27, 2026 / 03:56 AM IST

డీ గ్లామర్ లుక్‌లో మమిత బైజు..!

ధనుష్ హీరోగా, మమిత బైజు హీరోయిన్‌గా విఘ్నేష్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కారా’. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు మాట్లాడుతూ.. ఈ సినిమాలో మమితను ఇప్పటివరకు చూడని సరికొత్త లుక్‌లో చూస్తారని తెలిపాడు. ఆమె పల్లెటూరి అమ్మాయిగా, డీ-గ్లామర్ రోల్‌లో కనిపించబోతుందన్నాడు. తెరపై ఆమె నటన చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారని పేర్కొన్నాడు.

March 26, 2026 / 09:51 PM IST

‘రాకాస’ సెన్సార్ పూర్తి.. ఏప్రిల్ 3న రిలీజ్

సంగీత్ శోభన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో నిహారిక కొణిదెల నిర్మిస్తున్న చిత్రం ‘రాకాస’. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ‘U/A’ సర్టిఫికేట్‌ను పొందింది. మానస శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ ఏప్రిల్ 3న థియేటర్లలో సందడి చేయనుంది.

March 26, 2026 / 09:35 PM IST