NTR: ఫ్యాన్సే కాదు.. ఎన్టీఆర్ కూడా కాలర్ ఎగరేశాడు!
గత వారం రోజులుగా దేవర అంటూ.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా దేవర టైటిల్‌ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి దేవర ట్రెండింగ్‌లోనే ఉంది. తాజాగా ఎన్టీఆర్ నయా లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ట్రిపుల్ ఆర్(RRR) సినిమాతో గ్లోబల్ క్రేజ్ సొంతం చేసుకున్న తారక్.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ‘దేవర'(Devara Movie). ఈ సినిమా భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదల చేసిన ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ఓ రేంజ్లో ఉంది. తాజాగా లేటెస్ట్ ఫోటో షూట్‌తో అదరగొట్టేశాడు ఎన్టీఆర్. దేవరలో కనిపించిన రగ్గ్డ్ లుక్‌నే కాస్త ట్రిమ్ చేసి.. లేటెస్ట్ లుక్‌లో షార్ప్‌గా కనిపిస్తున్నాడు ఎన్టీఆర్. ఓ బ్రాండ్ ఎండోర్స్ మెంట్ కోసం కాస్త సాఫ్ట్ లుక్‌లో కనిపించాడు తారక్. చాలా స్టైలిష్‌గా, మ్యాన్లీగా ఉన్నాడు. ఈ స్టిల్స్‌లో డిఫెరెంట్ మూడ్‌లో కనిపిస్తున్నాడు. ముఖ్యంగా ఎన్టీఆర్ కాలర్ ఎగరేస్తున్న ఫోటో ఒకటి ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను తెగ అట్రాక్ట్ చేస్తోంది. టెంపర్ సినిమా తర్వాత అభిమానులు కాలర్ ఎగరేసే సినిమాలు చేస్తానని మాటిచ్చిన ఎన్టీఆర్.. అప్పటి నుంచి కాలర్ ఎగరేసే సినిమాలే చేస్తున్నాడు.
ఇప్పుడు ఎన్టీఆర్ కాలర్ ఎగరేయడం చూసి.. నిజంగా నువ్వ మా దేవర అంటున్నారు అభిమానులు. ఇకపోతే.. ప్రస్తుతం దేవర(Devara Movie) షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. ఎన్టీఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ కలిసి ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలిఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కానుంది. దేవర తర్వాత వార్ 2, ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్స్ చేయబోతున్నాడు తారక్.