KRNL: కర్నూలు నగర శివారులోని గార్గేయపురం డంపింగ్ యార్డ్‌ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ఇవాళ సందర్శించారు. నగర కమిషనర్ విశ్వనాథ్, ఆర్డీవోలతో కలసి చెత్తను శాస్త్రీయ విధానంలో డీ కంపోజ్ చేసే ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా యార్డ్‌లో అమలవుతున్న నిర్వహణ పద్ధతులను అధికారులతో సమీక్షించి, మరింత మెరుగైన చర్యలు చేపట్టాలని సూచించారు.