అసలే సాహో, రాధే శ్యామ్ సినిమాల ఫ్లాప్‌తో.. మంచి ఆకలి మీదున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అందుకే అప్ కమింగ్ ఫిల్మ్స్‌తో పాన్ ఇండియాను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అందుకు వచ్చే సంక్రాంతిని టార్గెట్‌గా పెట్టుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఆదిపురుష్’ను.. జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని.. పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. మొత్తంగా ఆదిపురుష్ పై భారీ అంచనాలున్నాయి. అయితే ఇప్పుడు ప్రభాస్‌కు పోటీగా మహేష్ బాబు హిట్ మూవీ పోకిరిని రిలీజ్ చేస్తుండడం ఆసక్తికరంగా మారింది. ఒక్క ప్రభాస్ అనే కాదు ఈ సారి సంక్రాంతి బరిలో మెగాస్టార్ 154.. విజయ్ ‘వారసుడు’ సినిమాలతో పాటు ఇంకొన్ని సినిమాలున్నాయి.
అయినా ఒక్కడు మూవీని రీ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే దానికి ఓ బలమైన కారణమే ఉంది. గుణశేఖర్ దర్శకత్వంలో ఎం.ఎస్ రాజు నిర్మాణంలో 2003లో సంక్రాంతికి విడుదలైన ‘ఒక్కడు’ చిత్రం కమర్షియల్‌గా భారీ విజయాన్ని అందుకొని.. మహేషక్ కెరీర్లో ఓ మైలు రాయిగా నిలిచింది. అయితే 2023 సంక్రాంతికి ఈ సినిమా విడుదలై ఇరవై ఏళ్లు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని ‘ఒక్కడు’ సినిమాను మరోసారి రిలీజ్ చేయబోతున్నారు. 2023 జనవరి 8న ‘ఒక్కడు’ రీ రిలీజ్ చేయనున్నట్టు.. నిర్మాత ఎం.ఎస్.రాజు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. 4కే వెర్షన్లో వరల్డ్ వైడ్‌గా స్పెషల్ షోస్ స్క్రీనింగ్ చేయబోతున్నట్లు తెలిపాడు. దీంతో రీసెంట్గా మహేష్ బర్త్ డే నాడు ‘ఒక్కడు’, ‘పోకిరి’ స్పెషల్ షోలతో రచ్చ చేసిన మహేష్ ఫ్యాన్స్.. మరోసారి ఎగ్జైట్‌గా ఫీలవుతున్నారు. ఏదేమైనా ఒక్కడు రీ రిలీజ్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది.