»Ganja Shankar Warning On The Title Of Ganja Shankar Has It Stopped
Gaanja Shankar: గాంజా శంకర్ టైటిల్ పై వార్నింగ్.. ఇక ఆగిపోయినట్టే?
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌కు నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ఆగిపోయిన్టుగా గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా టైటిల్ పై వార్నింగ్ ఇస్తూ.. లేఖ రిలీజ్ చేశారు నార్కోటిక్ బ్యూరో అధికారులు.
Gaanja Shankar: యాక్సిడెంట్ తర్వాత పూర్తిగా కోలుకున్నప్పటికీ.. విరూపాక్ష సినిమాతో పాటు.. బ్రో సినిమా కోసం బాగానే కష్టపడ్డాడు సాయి ధరమ్ తేజ్. అందుకే.. నెక్స్ట్ సినిమా కోసం కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు గాంజా శంకర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇప్పటికే గాంజా శంకర్ నుంచి రిలీజైన పోస్టర్స్ అదిరిపోయాయి. అయితే ఈ చిత్రం మధ్యలోనే ఆగిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. బడ్జెట్ పెరగడమే ఇందుకు కారణం అన్నారు. దీనికి తోడు సాయి ధరమ్ తేజ్ 15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో.. గాంజా శంకర్ ఆగిపోయిందనే రూమర్స్ వచ్చాయి. ఇక ఇప్పుడు ఏకంగా నార్కోటిక్స్ బ్యూరో అధికారులు.. ఈ టైటిల్ కరెక్ట్ కాదని నోటీస్ జారీ చేశారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు.. సినిమాలో గంజాయి అనే పదాన్ని తొలగించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఈ సినిమాలో మాదక ద్రవ్యాలకు సంబంధించిన అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉంటే.. ఎన్డీపీఎస్ 1985 యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సినిమాలో గంజాయి మొక్కలను చూపించారని.. గంజాయి వాడకాన్ని ప్రోత్సహించే విధంగా ఉందని.. ఇప్పటికే రిలీజ్ చేసిన వీడియో ద్వారా తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. టైటిల్ కూడా మార్చాలని కోరారు. దీంతో గాంజా శంకర్ పూర్తిగా అటకెక్కినట్టేనని అంటున్నారు. అసలే సినిమా ఆగిపోయిందంటే.. ఇప్పుడు పోలీసుల నుంచి నోటీసులు రావడంతో.. మేకర్స్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.