బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబుతో ‘కొబ్బరి మట్ట’ సినిమా తీసిన డైరెక్టర్ రూపక్ రోనాల్డ్ సన్ ఇప్పుడు 'పరేషాన్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
టాలీవుడ్(Tollywood) హీరో దగ్గుబాటి రానాకు (Daggubati Rana) గంగవ్వ (Gangavva) దావత్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కల్లు తాగిన నిషాలో రానా ‘పరేషాన్ మూవీ(Pareshan Movie) టీమ్ తో ముచ్చటించారు. రానా సమర్పణలో రాబోతున్న పరేషాన్ అనే సినిమా ప్రమోషన్స్ కోసం మై విలేజ్ షో టీంతో సందడి చేశారు. రానా అండ్ టీమ్ కలిసి ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపారు. పరేషాన్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాతో రానా సమర్పణలో మూవీ తెరకెక్కింది. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
పరేషాన్ మూవీ(Pareshan Movie) ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ గంగవ్వను కలిశారు. కాసేపు గంగవ్వ(Gangavva)తో సరదాగా ముచ్చటించారు. ఇందులో భాగంగానే రానా(Daggubati Rana)కు గంగవ్వ కల్లు దావత్ ఇవ్వగా ఆ కల్లు తాగిన తర్వాత రానా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబుతో ‘కొబ్బరి మట్ట’ సినిమా తీసిన డైరెక్టర్ రూపక్ రోనాల్డ్ సన్ ఇప్పుడు పరేషాన్ అనే సినిమా(Pareshan Movie) తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నేటితరం ఆడియన్స్ కోరుకునే ఫన్నీ సన్నివేశాలతో డిఫరెంట్ గా పరేషాన్ మూవీని తెరకెక్కించారు. రానా దగ్గుబాటి(Daggubati Rana) సమర్పణలో రూపొందిన ఈ సినిమాలో పావని హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీ జూన్ 2న విడుదల చేయనున్నట్లు రానా తెలిపారు.