ADB: జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న సాత్నాల మండలానికి చెందిన ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేసినట్టు ఆదిలాబాద్ DSP జీవన్ రెడ్డి సోమవారం రాత్రి తెలియజేశారు. దొంగలలో ఇద్దరు మహిళలు, ఒక బాలుడు ఉన్నట్లు వెల్లడించారు. వారి వద్ద నుంచి బంగారం, నగదు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.