కడప: జిల్లా వ్యాప్తంగా మహిళల భద్రతపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు గ్రామాలు, కాలనీలు, పట్టణాల్లో పోలీసులు మహిళలు, యువతులు, బాలికలు, డ్వాక్రా మహిళలతో సమావేశాలు నిర్వహించి భద్రతా చట్టాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. మోసాలు ఎదురైతే వెంటనే 112 హెల్ప్‌లైన్ నంబర్లకు సంప్రదించాలని సూచించారు.