WNP: పట్టణంలో అర్ధరాత్రి ఇళ్లలో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాల పైపులు కోసి పెట్రోలు దొంగిలిస్తున్నారని పట్టణ ప్రజలు వాపోతున్నారు. పోలీస్ పెట్రోలింగ్ లేని ప్రదేశాలలో ప్రతిరోజు పెట్రోల్ దొంగలు బరితెగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై దృష్టి సారించి ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా అధికారులు కృషి చేయాలని కోరుతున్నారు.