SDPT: పోలీస్ కమిషనరేట్ పరిధిలో మార్చి 24వ తేదీ వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఈ కాలంలో ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు. బంద్‌ల పేరిట ఎవరైనా విద్యా సంస్థలు, కార్యాలయాలను బలవంతంగా మూసివేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.