TG: HYDలో ఐటీ కారిడార్ పరిధి విస్తరణకు ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి, గండిపేట, రాజేంద్రనగర్ మండలాల్లోని ప్రభుత్వ భూముల్లో మరిన్ని ఐటీ సంస్థలు, క్లస్టర్ల ఏర్పాటుకు వీలుగా TGIIC సన్నాహాలు చేస్తోంది. ఇటీవల గచ్చిబౌలి సమీపంలో TGIIC భూములను వేలం వేయగా ఎకరా రూ.170 కోట్లకుపైగా అమ్ముడవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.