MDK: జిల్లాలో మహిళా, శిశు సంక్షేమశాఖ పనితీరు ఆదర్శంగా ఉందని ఐసీడీఎస్ డైరెక్టర్ శృతి ఓజా ప్రశంసించారు. సోమవారం ఆమె మెదక్ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ ప్రతిమ సింగ్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. జిల్లాలో అంగన్వాడీ, సఖి సెంటర్లలో బాధితులకు, చిన్నారులకు మెరుగైన సేవలు అందుతున్నాయన్నారు.