NDL: కార్మికులకు ఉపాధి పనుల వద్ద మౌలిక వసతులు కల్పించాలని CPI జిల్లా నాయకుడు ఎం. రమేష్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. సోమవారం ఈ విషయంపై జూపాడుబంగ్లా పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. అదే విధంగా పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలను పెంచాలని కోరారు. గతంలో ఉన్న మస్టర్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. ప్రభుత్వం తక్షణమే సమస్యను పరిష్కరించాలని కోరారు.