SRPT: అనంతగిరి మండలం చనుపల్లి గ్రామ శివారులోని పాలేరు వాగు నుంచి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు పట్టుకున్నారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేసి వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించేట్లు అనంతగిరి ఎస్సై తెలిపారు. ఇసుక అక్రమంగా ప్రమాణాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.