SRD: జిల్లాలో ఈనెల 14 నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం జిల్లాలోని మండల విద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్, తాగునీరు, ఫర్నిచర్ తదితర ఏర్పాట్లు చేయాలని సూచించారు.