మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ చిత్రం ‘పెద్ది’. జూన్ 4న పాన్ ఇండియా లెవెల్లో విడుదలవుతున్న ఈ సినిమా, యూఎస్ ప్రీ సేల్స్‌లో రూ.6 లక్షల డాలర్ల మార్కును దాటింది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రం ప్రీమియర్స్‌తోనే 1 మిలియన్ డాలర్ల గ్రాస్ సాధించే దిశగా దూసుకెళ్తోంది.