Pawan Kalyan: యాక్టర్ కమ్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ కి పరిచయం అవసరం లేదు. ఆయన ఓవైపు రాజకీయాలు చేస్తూనే మరోవైపు ఫ్యాన్స్ కోసం సినిమాలు చేస్తున్నారు. ఆయన హీరో గా నటిస్తున్న తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా… శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించిన ఓ సింపుల్ టీజర్ ని విడుదల చేశారు. ఈ టీజర్ చూసి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటారు. ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చేసింది. ఈ మూవీలో ఆయన పోలీసుగా కనిపిస్తున్నారు. అయితే… టీజర్ అంతా బాగుంది కానీ.. డైలాగులే కొందరి మనోభావాలను దెబ్బతీశాయి. ముఖ్యంగా రాజకీయంగా ఆ డైలాగులు రాయడం గమనార్హం. టీజర్ సినిమా ప్రచార కంటెంట్ కంటే రాజకీయ ప్రకటనలా కనిపించడం వల్ల వివాదానికి దారితీసింది.
రాజకీయ ప్రకటనలపై నిషేధం లేనప్పటికీ, డిజిటల్ లేదా ప్రింట్ మీడియాలో వాటిని ఉపయోగించే ముందు అనుమతిని పొంది, ప్రీ-సర్టిఫికేషన్ ప్రక్రియలో పాల్గొనవలసి ఉంటుంది. సినిమాని నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్, టీజర్‌ను ఆవిష్కరించే ముందు భారత ఎన్నికల సంఘం నుండి ఎలాంటి అనుమతి తీసుకోలేదు.ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీడియాతో స్పందించారు. తాను కంటెంట్‌ను చూడలేదని, వాదనలు (ఇది రాజకీయ ప్రకటన అని) నిజమైతే, వారు చిత్రనిర్మాతలకు, జనసేన పార్టీకి లీగల్ నోటీసులు పంపుతారట. ఈ లెక్కన పవన్ కి కూడా నోటీసులు అందనున్నాయని తెలుస్తోంది.