MDK: మంజూరైన ఇందిరమ్మ గృహాలను వెంటనే నిర్మించుకోవాలని గృహ నిర్మాణ శాఖ డీఈ ప్రసన్న పేర్కొన్నారు. పెద్ద శంకరంపేట మండలం కోలపల్లి, కమలాపూర్ గ్రామాలలో నిర్మించిన ఇందిరమ్మ గృహాలను ఎంపీడీవో క్రాంతి కుమార్ తో కలిసి ప్రారంభించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏఈ కౌశిక్, ఎంపీవో జాకీర్ హుస్సేన్, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.