NLG: రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సోమవారం కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల, చెర్వుఅన్నారం, గార్లబాయిగూడెం, కురుమర్తి, కట్టంగూర్, ముత్యాలమ్మగూడెం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.