NGKL: నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డులో డ్రైనేజీ నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి సోమవారం భూమి పూజ చేసి, పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ తీగల సునేంద్ర కుమార్, వైస్ ఛైర్మన్ బాదం రమేశ్ పాల్గొన్నారు.