TG: గత ప్రభుత్వం తుమ్మిడిహట్టి ప్రాజెక్టును పక్కన పెట్టి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం చేసిందని CM రేవంత్ రెడ్డి ఆరోపించారు. తాము ఆ ప్రాజెక్టును నిర్మించి ఆదిలాబాద్లో గోదావరి నీళ్లు పారిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాను పర్యాటకంగా అభివృద్ది చేస్తామని చెప్పారు. ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలనేదే తమ ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. 2034లోపు జిల్లా రూపు రేఖలు మారుస్తామన్నారు.