వరంగల్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ డా. సత్య శారద ప్రజల నుండి 150 వినతిపత్రాలను స్వీకరించారు. రెవెన్యూ 58, జీడబ్ల్యూఎంసీ 27, ఇతర శాఖలకు 65 దరఖాస్తులు అందినట్లు ఆమె తెలిపారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జూమ్ ద్వారా తహసీల్దార్లతో సమన్వయం చేసి వినతులను పరిశీలించారు.