AP: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టు శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 28న డేటా సెంటర్ శంకుస్థాపన జరగనుందని మంత్రి లోకేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు గూగుల్ క్లౌడ్ CEO థామస్ కురియన్ పాల్గొనబోతున్నట్లు పేర్కొన్నారు. కాగా, ప్రాజెక్ట్ కోసం గూగుల్ రాష్ట్రంలో 15 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.1,33,215 కోట్లు) పెట్టుబడి పెట్టనుంది.