AP: విశాఖలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 28న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, గూగుల్ క్లౌడ్ సీఈవో కురియన్ సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది. 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో దీన్ని నెలకొల్పనున్నారు. డేటా సెంటర్కు విశాఖ సమీపంలో 3 చోట్ల 601.4 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. జులై 2028 నాటికి ఈ ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది.