దర్శకుడు సుకుమార్, DSPల క్రేజీ కాంబోకు బ్రేక్ పడనుందా? ఫిలింనగర్ టాక్ ప్రకారం అవుననే ప్రచారం సాగుతోంది. ‘ఆర్య’తో మొదలైన వీరి ప్రయాణం ‘పుష్ప 2’ వరకు విజయవంతంగా సాగింది. అయితే, వీరి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయట. దీంతో సుకుమార్ తదుపరి ప్రాజెక్ట్ ‘RC 17’కి ఈ కాంబో దూరం కానుందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.