మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఇంట్లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మెగా ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు, వెంకటేశ్, నాగార్జున, మహేశ్ బాబు(Mahesh Babu), జూనియర్ ఎన్టీఆర్, మంచు లక్ష్మి. ఇలా చాలామంది తారలు ఈ వేడుకల్లో సందడి చేశారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. కాగా ఇదే వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ చేసి అలరించారు. చిరంజీవి యంగ్ జనరేషన్ కు ఏమాత్రం తగ్గకుండా ఫుల్ జోష్ తో డ్యాన్స్ చేయడం అందరినీ ఆకట్టుకుంది.
రాజకుమారి (Rajakumari) తో కలిసి చిరు హుషారుగా డ్యాన్స్ చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బాలీవుడ్ బాద్ షా షారుక్ నటించిన జవాన్ (Jawan movie) టైటిల్ సాంగ్కు తన దైన స్టైల్లో డ్యాన్స్ వేశారు మెగాస్టార్. ప్రముఖ సింగర్ రాజకుమారి ‘జవాన్’ పాటను ఆలపిస్తుండగా చిరంజీవి తనదైన గ్రేస్తో డ్యాన్స్ చేశారు. ఇక హీరో రామ్ చరణ్ (Ram Charan) దగ్గరుండి మరీ తన తండ్రిని ఎంకరేజ్ చేస్తూ కనిపించడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్గా మారింది. ‘బాసూ.. అదిరింది మీ గ్రేసు..’ అంటూ అభిమాన్లు, నెటిజన్లు (Netizens) క్రేజీ కామెంట్లు పెడుతున్నారు.