»Parineeti Chopra And Raghav Chadha Celebrate Their First Diwali In Style Donning Stunning Ethnic Ensembles
Parineeti Chopra: స్టన్నింగ్ లుక్ లో పరిణితీ, రాఘవ్
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సోదరిగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది పరిణితీ చోప్రా. ఆ తర్వాత వరస అవకాశాలు చేజిక్కించుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కాగా ఈ బ్యూటీ రీసెంట్ గా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆప్ నేత రాఘవ్ చద్దాని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కాగా ఈ జంట రీసెంట్ గా తమ పెళ్లి తర్వాత మొదటి దీపావళి సెలబ్రేట్ చేసుకున్నారు. వారి దీపావళి చిత్రాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
Parineeti Chopra and Raghav Chadha celebrate their first Diwali in style, donning stunning ethnic ensembles
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా ఇద్దరూ దీపావళి సందర్భంగా ఫోటోలకు అందంగా పోజులిచ్చారు. ఒక చిత్రంలో చేతులు పట్టుకోవడం నుంచి ప్రకాశించే ముఖాలతో ఒకరినొకరు కౌగిలించుకోవడం వరకు చాలా క్యూట్ గా కనిపిస్తున్నారు. ఈ ఫోటోలు వారి ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. పండుగల సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి మన సెలబ్రిటీలు అబ్బురపరిచే ఫ్యాషన్ స్ఫూర్తిని ఇస్తున్నారు. కాగా ఆ జాబితాలో ఈ క్యూట్ జోడి కూడా చేరిపోయింది. ట్రెండ్ ని ఫాలో అవుతూనే చాలా ట్రెడిషన్ గా కనిపించారు. వారి డ్రెస్సింగ్ స్టైల్ కూడా అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఇక వారు తమ మొదటి దీపావళి పండగ ఫోటోలను షేర్ చేసి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ ఫోటోలకు ఇప్పుడు లైకుల వర్షం కురుస్తోంది. క్యూట్ జోడి అంటూ ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. వారికి దీపావళి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు. మీరు కూడా వారి ఫోటోలపై ఓ లుక్ వేయండి. ఇదిలా ఉండగా రాఘవ్-పరిణీతి వివాహం సెప్టెంబర్ 24వ తేదీన అంగరంగ వైభవంగా జరిగింది. బంధు మిత్రులు, స్నేహితుల సమక్ష్యంలో రాఘవ్ తన ప్రేయసి పరిణీతి మెడలో మూడుముళ్లు వేశారు. ఇక ఈపెళ్ళికి ఎంతో మంది స్టార్ సెలబ్రిటీలు రాగా..అందులో ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే, మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం సహా పలువురు రాజకీయ, క్రీడా, సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.