KMM: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గురువారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ. 21,800 ఉండగా, కొత్త మిర్చి ధర రూ. 21,450 అలాగే క్వింటా పత్తి ధర రూ. 8,400 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ. 200 తగ్గగా, కొత్త మిర్చి ధర రూ. 450, పత్తి ధర రూ.100 పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు.