నిర్మల్ మున్సిపాలిటీ కో-ఆప్షన్ పదవుల భర్తీకి మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం నాలుగు పదవులకు గానూ ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించారు.