BHPL: చిట్యాల మండల కేంద్రంలోని అంగన్వాడి సెంటర్లలో గురువారం అంగన్వాడి టీచర్ల ఆధ్వర్యంలో ‘పోషణ పక్వాడ్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా MRO వసంతరావు హాజరై, మాట్లాడారు. పిల్లలు పుట్టినప్పటి నుంచి సరైన ఆహారం ఇస్తేనే వారు ఆరోగ్యవంతమైన పౌరులుగా ఎదుగుతారని పేర్కొన్నారు. సూపర్వైజర్ జయప్రద, సర్పంచ్ లక్ష్మి, ఉప సర్పంచ్ వెంకటేష్ ఉన్నారు.