రాజ్యాంగాన్ని ఎన్డీయే ప్రభుత్వం హైజాక్ చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. ప్రజాప్రాతినిధ్య చట్టానికి రక్షణగా ఉన్న చట్టాన్ని మారుస్తున్నారని, 2024లో 33 శాతం ఉన్న రిజర్వేషన్ను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుని జనగణన తర్వాత అమలు చేస్తామన్నారని, ఇప్పుడు డీలిమిటేషన్ను అర్జెంటుగా ప్రవేశపెడుతున్నారని ఆరోపించారు.