పంజాబ్‌పై అజేయ సెంచరీ(112)తో ముంబై బ్యాటర్ క్వింటన్ డీకాక్ అరుదైన రికార్డ్ సొంతంచేసుకున్నాడు. IPLలో 3 ఫ్రాంచైజీ( ఢిల్లీ, లక్నో, ముంబై)ల తరఫున సెంచరీ చేసిన తొలి విదేశీ ఆటగాడిగా డీకాక్ నిలిచాడు. ఓవరాల్‌గా అతని కంటే ముందు KL రాహుల్, సంజూ శాంసన్ ఈ ఘనత సాధించారు. రాహుల్ పంజాబ్, లక్నో, ఢిల్లీ తరఫున సెంచరీలు చేయగా.. శాంసన్ ఢిల్లీ, రాజస్థాన్, చెన్నై కోసం శతకాలు బాదాడు.