TG: రాష్ట్ర డీజీపీగా బి.శివధర్ రెడ్డి నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు రాష్ట్ర హైకోర్టు నిరాకరించింది. రాష్ట్రంలో పూర్తిస్థాయి డీజీపీ నియామక ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోందని ప్రభుత్వం కోర్టుకు వెల్లడించింది. అయితే, శివధర్ రెడ్డి నియామకం సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉందని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.