‘పెద్ది’ సినిమాపై సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా నెగెటివిటీ క్రియేట్ చేస్తున్న ఇద్దరిపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. గుంటూరు, హైదరాబాద్కు చెందిన ఇద్దరు యువకులు అసత్య ప్రచారం చేస్తున్నట్లు గుర్తించిన చిత్రబృందం, ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేసిందట. దీనిపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. కాగా, సినిమా విషయంలో టీమ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది.