విలక్షణ నటన, గంభీరమైన వాయిస్‌తో క్రేజ్ తెచ్చుకున్న నటుడు అర్జున్ దాస్ రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఈ పుకార్లపై అర్జున్ దాస్ టీమ్ స్పందిస్తూ.. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. ఇలాంటి వ్యక్తిగత విషయాలపై కథనాలు రాసే ముందు నిజా నిజాలు తెలుసుకోవాలని మీడియాను కోరింది.