ప్రముఖ సింగర్ ఆశా భోస్లే ఏడు దశాబ్దాల సినీ ప్రస్థానంలో 12 వేలకు పైగా పాటలు పాడి గిన్నిస్ రికార్డు సృష్టించారు. 1943లో ప్రస్థానం మొదలుపెట్టి, ఓపీ నయ్యర్, ఆర్డీ బర్మన్ సంగీతంలో పాడిన మెలోడీలు, క్యాచీ సాంగ్స్‌తో రాణించారు. రెండు జాతీయ అవార్డులు, పద్మ విభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే వంటి అవార్డులను అందుకున్న ఆమె.. భారతీయ సంగీత శిఖరంగా నిలిచారు.