సిద్ధార్థ్, షామిలి జంటగా నటించిన క్లాసిక్ లవ్ స్టోరీ ‘ఓయ్’ మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. ఆనంద్ రంగ దర్శకత్వంలో డి.వి.వి దానయ్య నిర్మించిన ఈ చిత్రం 2009లో ఆశించిన విజయం సాధించనప్పటికీ, కాలక్రమేణా మంచి ఆదరణ పొందింది. గతంలో రీ-రిలీజ్లో అద్భుతమైన రెస్పాన్స్ రాగా, జూలై 18న ఈ సినిమాను మళ్లీ విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.