రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సానా తెరకెక్కించిన మల్టీ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’పై భారీ అంచనాలు ఉన్నాయి. జూన్ 4న విడుదల కానున్న ఈ సినిమాకి ఏపీలో ఆల్రెడీ టికెట్ రేట్ల హైక్స్, షో టైమింగ్స్కి అనుమతులు వచ్చాయి. ఇప్పుడు నైజాం మార్కెట్లోనూ జూన్ 1 నుంచి బుకింగ్స్ షురూ కానున్నట్లు టాక్. ఇక్కడ కూడా భారీగా టికెట్ రేట్లు పెరిగే ఛాన్స్ ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.