»Ankita Lokhande Who Is Pregnant In Hindi Bigg Boss House
Bigg Boss House:లో సంచలనం..ప్రెగ్నెంట్ అయిన కంటెస్టెంట్?
బిగ్ బాస్ హౌస్‌లోని కంటెస్టెంట్స్ గేమ్‌లో భాగంగా ఫైట్ చేసుకోవడం, ఒకరిని ఒకరు దూషించుకోవడం చూశాము. కానీ తాజాగా హిందీ బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న ఒక కంటెస్టెంట్‌కు తాను ప్రెగ్నెంట్ ఏమో అన్న భయం పట్టుకుంది. ఈ విషయం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
Ankita Lokhande who is pregnant in Hindi Bigg Boss house?
Bigg Boss House: బిగ్ బాస్(BigBoss) షో ప్రస్తుతం పలు భాషల్లో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ షో ఎన్ని భాషాల్లో వచ్చినా హిట్‌గా నిలుస్తుంది. కంటెస్టెంట్ల నడుమ పోటీ పెట్టి వారు తిట్టుకునేలా చేసి తరువాత వారిలో వారికి సారీ చెప్పించడం కామన్. భార్యభర్తలు షోలో ఉన్నా వారికి అదే పరిస్థితి ఉంటుంది. హిందీ బిగ్ బాస్17లో అంకిత లోఖండే(Ankita Lokhande), విక్కీ జైన్(Vicky Jain) ఇద్దరు భార్యభర్తలు తమదైన శైలీలో అలరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి నడుమ ఎన్నో సార్లు గొడవలు జరిగాయి. తరువాత కలిసిపోయారు. తాజాగా ఒక ఆసక్తి కరమైన సంఘటన చోటుచేసుకుంది.
తన భర్తతో అంకిత లోఖండే మాట్లాడుతూ.. తనకు ఈ నెల పీరియడ్స్ రాలేదని, ఒంట్లో కూడా బాగుండటం లేదని, ఇంటికి వెళ్లాలని పిస్తోందని చెబుతోంది. అవునా ఈ నెలా నీకు పీరియడ్స్ వచ్చాయి అనుకున్నానే అని భర్త విక్కీ అంటాడు. లేదు నిన్న మెడికల్ రూమ్‌కు పిలిచి రక్త పరీక్ష, మూత్ర పరీక్ష చేశారు. కానీ రిజల్ట్ చెప్పలేదు అని, అందుకే తనకు టెన్షన్ అవుతుందని చెప్తుంది. దీంతో విక్కీ షాక్ అవుతాడు. ప్రస్తుతం వీళ్ల మాటలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అంకిత నిజాంగానే ప్రెగ్నెంట్ అనే విషయం ఖాయం అయితే బిగ్ బాస్ హౌస్‌లో ప్రెగ్నెంట్ అయిన పేరెంట్స్ వీరేనని రికార్డు సృష్టించడం ఖాయమని నెటిజన్లు అంటున్నారు.