ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఒకటి. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్, పవన్ చేస్తున్న సినిమా ఇదే. అందుకే ఉస్తాద్ పై భారీ అంచనాలున్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన ఉస్తాద్ గ్లింప్స్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. గ్లింప్స్‌లో పవన్‌ను హై ఓల్టేజ్‌గా చూపించబోతున్నట్టుగా క్లియర్‌గా చెప్పేశాడు హరీష్ శంకర్. తాజాగా ఈ సినిమాలో ఏజెంట్ బ్యూటీని మరో హీరోయిన్గా తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఉస్తాద్ భగత్ సింగ్(Ustad Bhagatsingh)ను గబ్బర్ సింగ్‌కు మించి పవర్ ఫుల్ డైలాగ్స్‌తో తెరకెక్కిస్తున్నాడు హరీష్ శంకర్. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. రీసెంట్‌గానే శ్రీలీల బర్త్ డే సందర్భంగా ఆమె లుక్ రివీల్ చేశారు. అయితే ఈ సినిమా తమిళ్ హిట్ మూవీ ‘తేరీ’ రీమేక్‌గా తెరకెక్కుతున్నట్టు ప్రచారంలో ఉంది. ఈ క్రమంలో ఉస్తాద్(Ustad Bhagatsingh)లో ఇద్దరు హీరోయిన్లకు స్కోప్ ఉంది. ఇప్పటికే శ్రీలీల ఫిక్స్ అయిపోయింది.. కానీ మరో హీరోయిన్ విషయంలో క్లారిటీ రావడం లేదు. ఈ మధ్య బుట్టబొమ్మ పూజా హెగ్డే మరో హీరోయిన్గా ఫిక్స్ అయిపోయిందని వినిపించింది. కానీ ఇప్పుడు ఓ యంగ్ బ్యూటీని ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది.
ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో అఖిల్ ‘ఏజెంట్’ మూవీ ఘోరమైన డిజాస్టర్ అందుకుంది. ఈ సినిమాతో హీరోయిన్గా సాక్షి వైద్య అనే క్యూట్ బ్యూటీ తెలుగు ఆడియెన్స్‌కు పరిచయమైంది. ఏజెంట్ పై భారీ ఆశలు పెట్టుకున్న ఈ ముద్దుగుమ్మకు.. నిరాశే ఎదురైంది. ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో ‘గాండివదారి అర్జున’ సినిమాలో నటిస్తోంది. అలాగే సాయి ధరమ్ తేజ్ అప్ కమింగ్ ఫిల్మ్లోను ఛాన్స్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్‌తో నటించే ఛాన్స్ కొట్టేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుందని అంటున్నారు. ఇకపోతే.. మైత్రీ మూవీ మేకర్స్ గ్రాండ్‌గా నిర్మిస్తున్న ఈ చిత్రానికి.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.