Advi sesh: అడివి శేష్ పెళ్లి ఫిక్స్.. అమ్మాయి నాగార్జున మేనకోడలు!
ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ యంగ్ హీరోల్లో అడివి శేష్ రూటే సపరేటు. కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యంగా.. వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు ఈయంగ్ హీరో. క్షణంతో మొదలైన అడివిశేష్ బాక్సాఫీస్ హంట్.. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది. అయితే సినిమాల పరంగా సక్సెస్‌లో ఉన్న అడివి శేష్.. లవ్ విషయంలోను సక్సెస్ అయినట్టే ఉంది వ్యవహారం.
జూన్ 3న యంగ్ హీరో శర్వానంద్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇప్పుడు మరో యంగ్ హీరో అడివి శేష్(Advi sesh) కూడా పెళ్లి పీఠలెక్కబోతున్నట్టు తెలుస్తోంది. చాలా కాలంగా అడివి శేష్, అక్కినేని నాగార్జున(Akkineni nagarjuna) మేనకోడలు సుప్రియ(Supriya)తో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వస్తునే ఉన్నాయి. చాలాసార్లు ఈ ఇద్దరు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఎక్కడికెళ్లినా ఇద్దరు కలిసే వెళ్తారు. అక్కినేని ఫ్యామిలీలో ఎలాంటి ఈవెంట్ జరిగినా అడివి శేష్ ఉండాల్సిందే. ఇప్పటికే అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి.
మరో టాక్ ఏంటంటే.. ఈ ఇద్దరు కలిసి ఒకే అపార్ట్మెంట్లో లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నారని అంటున్నారు. కానీ పెళ్లి మాత్రం చేసుకోవడం లేదు. అడివి శేష్(Advi sesh) ఇంట్లో వాళ్లు సుప్రియతో పెళ్లికి ఒప్పుకోకపోవడమే ఇందుకు కారణం అనే టాక్ ఉంది. కానీ ఇప్పుడు వీళ్ల పెళ్లికి పద్దలు లైన్ క్లియర్ చేసినట్టు తెలుస్తోంది. అడివి శేష్, సుప్రియ(Supriya) పెళ్ళికి ఇరు కుటుంబ సభ్యులు ఓకే చెప్పారని..పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేశారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
అక్కినేని నాగచైతన్య ఈ పెళ్లికి పెద్దగా వ్యవహరిస్తున్నారట. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. జూన్ 16న వీళ్ల పెళ్లి జరగబోతుందని తెలుస్తోంది. అయితే దీని పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక మేజర్, హిట్ 2 సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న అడివిశేష్(Advi sesh).. ప్రస్తుతం ‘గూఢచారి’ సీక్వెల్ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌ను ‘జీ2’ టైటిల్‌తో అనౌన్స్ చేశాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి మేజర్ మూవీకి ఎడిటర్‌గా పనిచేసిన వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.