దక్షిణాది ప్రేక్షకులు తనపై చూపిస్తున్న ప్రేమ పట్ల తమన్నా కృతజ్ఞతలు తెలిపింది. తనను వాళ్ల ఇంటి ఆడబిడ్డలా, కుటుంబ సభ్యురాలిలా ఆదరించడం తనలో ఎల్లప్పుడూ కొత్త ఊపిరిని నింపుతోందని చెప్పింది. అందుకే వారిని మెప్పించేందుకు కొత్త కథలు, ప్రయోగాత్మక చిత్రాలతో సిద్ధమవుతున్నట్లు వెల్లడించింది. సౌత్ ఇండస్ట్రీలో దక్కుతున్న గౌరవం తనను మరింత ఉత్సాహపరుస్తోందని మిల్కీ బ్యూటీ పేర్కొంది.